గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అగ్నిప్రమాదం


గుంటూరు, 21 మే (హి.స.)రింగ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఎంతో శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులను స్టాక్ పెట్టడంతో వాటిని తొలగించేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు. పైపులు తగలబడి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఆర్పే సమయానికే అక్కడ ఉన్న డ్రైనేజీ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి.

2014-2019 టీడీపీ ప్రభుత్వంలో గుంటూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు పెండింగ్ పడిన నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో డ్రైనేజీ పైపులను డంప్ చేశారు. అధిక ఉష్ణోగ్రత వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande