తూప్రాన్ వద్ద నేషనల్ హైవేపై ప్రమాదం.. 8 కొత్త కార్లతో సహా కాలి బూడిదైన కంటైనర్ లారీ..
తూప్రాన్ వద్ద నేషనల్ హైవేపై ప్రమాదం.. 8 కొత్త కార్లతో సహా కాలి బూడిదైన కంటైనర్ లారీ..
Fire accident


మెదక్, 21 మే (హి.స.)

జాతీయ రహదారి-44పై వెళ్తున్న

కంటైనర్ లారీ ఇంజిన్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న 8 కార్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ జాతీయ రహదారి పై నాగులపల్లి బ్రిడ్జి సమీపంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నాగపూర్ నుంచి కాకినాడ వైపు కొత్త కార్లను తీసుకెళ్తున్న కంటైనర్ లారీకి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో లారీ మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande