
ఢిల్లీ, 21 మే (హి.స.)మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తండ్రిని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశం ఇచ్చారు. దేశాన్ని నైపుణ్యవంతమైన, సుసంపన్నమైన, శక్తివంతమైన భారతంగా తీర్చిదిద్దాలన్న రాజీవ్ గాంధీ కలను తాను తప్పక నెరవేర్చుతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజీవ్ గాంధీతో ఉన్న తన చిన్నప్పటి ఫొటోను షేర్ చేశారు.
'నాన్నా మీరు కలగన్న నైపుణ్యవంతమైన, సుసంపన్నమైన, బలమైన భారతదేశ స్వప్నాన్ని సాకారం చేసే బాధ్యతను పూర్తిగా నెరవేర్చుతా. మీ బోధనలు, మీ విలువలు, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి' అని రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో రాజీవ్ గాంధీ ఆలోచనలే మార్గదర్శకమని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi