మంథనిలో యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ తో అకస్మిక తనిఖీలు
మంథనిలో యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ తో అకస్మిక తనిఖీలు
Peddapalli


పెద్దపల్లి, 21 మే (హి.స.)

మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో

పెద్దపల్లి నార్కోటిక్ బృందం, మంథని పోలీసులు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్తో కలిసి గురువారం మంథని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. బైక్ పార్కింగ్ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande