
చెన్నై, 21 మే (హి.స.)గత 59 ఏళ్లుగా విశ్వాసంతో పనిచేస్తున్న హస్తం పార్టీ కార్యకర్తలకు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గంలో చోటు దక్కడం ఒక వరంగా అభివర్ణించింది కాంగ్రెస్. అధికారం కోసం విశ్వాసంతో, అంకితభావంతో ఇన్నాళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడుతున్నారని పేర్కొంది. ఇప్పుడు వారికి అధికారం దక్కిందని వెల్లడించింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో దీన్నొక మలుపుగా అభివర్ణించింది. విజయ్ క్యాబినెట్లో తమ పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రి పదవుల దక్కిన నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ఏఐసీసీ ఇన్చార్జ్ గిరీశ్ చోడంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi