బక్రీద్ పండుగపై అఖిల భారత గోరక్ష మహా సంఘ్ కీలక ప్రకటన
బక్రీద్ పండుగపై అఖిల భారత గోరక్ష మహా సంఘ్ కీలక ప్రకటన
punganur-all-india-goraksha-maha-sangh-secretary-appeal-for-bakrid-1522


చిత్తూరు

, 21 మే (హి.స.)బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగ సందర్భంగా పశుసంపదను, గోవుల పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వ చట్టాలను కచ్చితంగా అమలు చేయడం, మత సామరస్యాన్ని కాపాడేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యవసరం. ఇస్లామిక్ పండుగలలో గోవధ తప్పనిసరి కాదని, ప్రజా మనోభావాలను గౌరవించాలని మత పెద్దలు మరియు అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ సూచిస్తున్నారు.

దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంలో గోవుల పాత్ర అమూల్యమైనదని, అత్యంత పవిత్రమైనదని అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ కార్యదర్శి డా. పి. అయూబ్ ఖాన్ పేర్కొన్నారు. పశుసంపదను, గోవుల పవిత్రతను కాపాడుకోవడానికి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ మరియు సంరక్షణ చట్టం 1977 ను ప్రభుత్వ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదే సందర్భంలో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు డా. పి. అయూబ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన మరియు హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande