
ఖమ్మం, 21 మే (హి.స.)
వైరా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి
సారించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ ను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎమ్మెల్యే కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైరా నియోజకవర్గం పూర్తిగా గిరిజన ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న నిధులను వైరా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు కేటాయించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. ముఖ్యంగా రహదారులు, త్రాగునీటి సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు