జొన్నగిరిలో టీడీపీ కార్యకర్తల సమావేశం
అమరావతి, 22 మే (హి.స.) కర్నూలు, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాలంటే ఎవరు రాలేని పరిస్థితి ఉండేదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీపడి ముందుకు వస్తున్నారన్
జొన్నగిరిలో  టీడీపీ కార్యకర్తల  సమావేశం


అమరావతి, 22 మే (హి.స.)

కర్నూలు, గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాలంటే ఎవరు రాలేని పరిస్థితి ఉండేదని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీపడి ముందుకు వస్తున్నారన్నారు. ఈరోజు(శుక్రవారం) తుగ్గలి మండలం జొన్నగిరిలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మైనింగ్ శాఖలో రూ. 4 వేల కోట్లు అధికంగా రాబడి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలన విధానాన్ని చూసి భారత దేశంలో వచ్చిన పెట్టుబడులలో 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande