అర్థరాత్రి రెచ్చిపోయిన యువకులు..భయాందోళనకు గురయిన ప్రజలు
అర్థరాత్రి రెచ్చిపోయిన యువకులు..భయాందోళనకు గురయిన ప్రజలు
అర్థరాత్రి రెచ్చిపోయిన యువకులు..భయాందోళనకు గురయిన ప్రజలు


విజయవాడ, 22 మే (హి.స.)విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఒకరినొకరు కార్లతో ఢీకొట్టుకుంటూ హల్చల్ చేశారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ పవన్ కిషోర్ అక్కడికి చేరుకుని.. ఇరు వర్గాలకు చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande