ఐపీఎల్ లో నేడు ఎస్ ఆర్ హెచ్, ఆర్ సి బి మధ్య హైవోల్టేజి మ్యాచ్..
ఐపీఎల్ లో నేడు ఎస్ ఆర్ హెచ్, ఆర్ సి బి మధ్య హైవోల్టేజి మ్యాచ్..
క్రికెట్


హైదరాబాద్, 22 మే (హి.స.)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా

ఈరోజు అత్యంత కీలకమైన పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. నేడు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్, ఇరు జట్ల ప్లేఆఫ్స్ స్థానాలు నిర్ణయించబడే అవకాశం ఉంది.

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం ఇరు జట్లు నాకౌట్ స్టేజ్ లోనే ఉన్నప్పటికీ.. భారీ రన్ రేట్ తో గెలిస్తే SRH రెండో స్థానానికి చేరుతుంది. ఒకవేళ RCB గెలిస్తే రెండు జట్లూ.. వాటి స్థానాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటంతో, స్థానిక అభిమానుల మద్దతుతో మంచి ప్రదర్శన ఇచ్చి విజయం సాధించి తొలి మ్యాచుకు రివెంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరి ఈ సాయంత్రం జరగబోయే హై-వోల్టేజ్ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande