ఉపాధి కూలీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి: ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్
ఉపాధి కూలీల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి: ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్
Collector


ఖమ్మం, 22 మే (హి.స.)

గ్రామ స్థాయిలో జరుగుతున్న పనులు ఏ విధంగా ఉన్నాయో స్వయంగా ఉదయం 6:30 గంటలకు ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశానికి చేరుకున్న ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. అనంతరం మండలంలోని ఏన్కూర్, జన్నారం, తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలతో పని ప్రదేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె, పనిచేసే కూలీలకు సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి సౌకర్యం, షెడ్ నెట్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి పంచాయతీలో గ్రామ కార్యదర్శి 6 గంటలకు సమయానికి పని ప్రదేశానికి చేరుకుని పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా మండలం లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో భాగ్యశ్రీకి సూచించారు. అనంతరం ఏన్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో రివ్యూ మీటింగ్ జరిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande