క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేడు మెట్రో రైలు సేవల సమయం పొడిగింపు
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేడు మెట్రో రైలు సేవల సమయం పొడిగింపు
Metro


హైదరాబాద్, 22 మే (హి.స.)

మహానగరంలోని క్రికెట్ లవర్స్కు

అభిమానులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ (HMRL) తీపి కబురు చెప్పింది. ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెట్రో రైలు సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.

సాధారణంగా రాత్రి వేళల్లో మ్యాచ్ ముగిసేసరికి భారీగా జనసందోహం ఏర్పడటంతో పాటు రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను మెట్రో రైలు సర్వీసులను అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే స్టేడియం సమీపంలోని ఉప్పల్, స్టేడియం మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల క్రికెట్ అభిమానులు తిరుగు ప్రయాణం కోసం క్యూ లైన్లలో వేచి ఉండకుండా, ముందస్తుగానే రిటర్న్ జర్నీ టికెట్లను లేదా స్మార్ట్ కార్డ్స్, డిజిటల్ క్యూఆర్ (QR) టికెట్లను కొనుగోలు చేసుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. మరోవైపు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, సురక్షితంగా, వేగంగా ఇళ్లకు చేరుకోవడానికి వీలైనంత వరకు మెట్రో సేవలనే వినియోగించుకోవాలని నగర రవాణా శాఖాధికారులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande