వలస జిల్లా కాదు.. జిల్లాకే వలసలు రావాలి : మంత్రి వాకిటి శ్రీహరి
వలస జిల్లా కాదు.. జిల్లాకే వలసలు రావాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Minister


నారాయణపేట, 22 మే (హి.స.)

వలసలు పోయే జిల్లా కాకుండా నారాయణపేట జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే జిల్లాగా మారుస్తామని మత్స్య, పాడి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలసల జిల్లా నారాయణపేట ప్రసిద్ధిగాంచిందని.. ఆనాటి వలసల జిల్లా నేడు మక్తల్- కోడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి త్వరలో లక్ష ఎకరాలకు సాగునీరు- తాగునీరు అందించి కృష్ణానది జలాలచే ఈ ప్రాంత రైతుల చెంతకు త్వరలోనే రైతులకు ఆర్థిక భరోసాను కల్పించబోతున్నామని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి 282 గ్రామ పంచాయతీలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచులు అందరు కూడా గ్రామాలను ఆర్థిక పట్టుకొమ్మల అన్నారు. యువత విద్యా, వైద్యం, ఉపాధి తదితర రంగాలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందించి ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేసినప్పుడే పల్లెలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేసి వారి సమస్యలను కలెక్టర్ ఆయా విభాగాల అధికారుల దృష్టికి తీసుకొని రావాలని వచ్చిన సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు వెంటనే పరిష్కారం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను ప్రతి అర్హులైన పేదవారికి అందేవిధంగా జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలని, ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అర్హులను గుర్తించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం సూచించినట్టుగా రూ.5 లక్షలు తోటి ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించుకోవాలని అనవసర ఆర్భాటాలకు పోయి అప్పులు చేసుకోవద్దని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande