
వేములవాడ, 22 మే (హి.స.)
వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీ సమీపంలోని రామప్ప గుట్ట వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సిరిసిల్ల శాంతినగర్కు చెందిన హరిచరణ్ గౌడ్(18), చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు. అయితే ఈతకు ఎంతమంది వెళ్లారు? మృతులు ఇద్దరు కలిసి వెళ్ళారా? లేదంటే వేరువేరుగా వెళ్ళారా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ళు సాయంతో మృతదేహాలను బయటకు తీయించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు యువకుల మరణంతో ఇరు కుటుంబాల్లో, గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..