
నెన్నెల : , 22 మే (హి.స.)
ప్రతి యేటా కొనుగోలు కేంద్రం నడుస్తుందన్న నమ్మకంతో రైతులు ధాన్నాన్ని రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టారు. అయితే ఇరువై రోజులు దాటినా ఇప్పటి వరకు ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. తీరా అధికారులను అడిగితే అక్కడ కేంద్రం ఎత్తి వేసినట్లు తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామంలో రైతులు కొనుగోలు కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 30 లారీల ధాన్యం ఉంటుంది. పీఏసీఎస్ ద్వారా ప్రతి యేటా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారు. కానీ ఈ యాసంగి పంటకు కేంద్రాన్ని ఎత్తి వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi