పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్ : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్ : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్ : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

నల్లగొండ 22 మే (హి.స.)

: రాష్ట్రంలోని కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ( Nomula Bhagath Kumar ) ఆరోపించారు. నల్లగొండ జిల్లా హలియా పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ( BRS ) హయాంలో పూర్తయిన హాస్పిటల్ను కూడా ప్రారంభించలేని అసమర్థ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ( KCR ) ప్రభుత్వంలో నిధులు మంజూరై పనులు 30 పడకల ఆసుపత్రి ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande