
హైదరాబాద్, 22 మే (హి.స.)
రూ.5,600 కోట్ల హీరా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Heera Group) ఎండీ నౌహీరా షేక్ను(Nowhera Shaikh) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా హీరా షేక్ అజ్ఞానంలో ఉంటున్నారు. నకిలీ ఆధార్తో గుర్గావ్లో ఉన్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం హైదరాబాకు తరలించినున్నారు. కాగా, షేక్ నౌహిరా, హీరా గ్రూపు ( Heera Group ) ప్రజల దగ్గరి నుంచి రూ.5వేల కోట్లను సేకరించింది.36 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తామంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి ఈ మొత్తాన్ని తీసుకుంది. అయితే ప్రజలకు వారు పెట్టిబడి పెట్టిన మొత్తాన్ని కూడా ఇవ్వకపోవడంతో, వారి ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెసిందే
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi