
రేణిగుంట, 22 మే (హి.స.)
రేణిగుంట 220KV సబ్స్టేషన్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించి భారీ మంటలు చెలరేగాయి. ఘటనతో విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు,అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
పేలుడుకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV