ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం.. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం.. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Collector


ములుగు, 22 మే (హి.స.)

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం స్థానిక భక్త రామదాసు కళా క్షేత్రంలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ... గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభ సమయంలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, ఇందిరా మహిళా శక్తి క్రింద బ్యాంకు రుణాలు కల్పన వంటి చర్యలతో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఖమ్మం జిల్లాలో పూర్తయ్యాయని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ప్రజా ప్రతినిధి వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని, పారిశుద్ధ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య చర్యలతో సీజనల్ వ్యాధులను తగ్గించవచ్చని పేర్కొన్నారు. తకు ముందుకు ఖమ్మం జిల్లా స్థాయి శాఖల అధికారులు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande