కర్నూలు జీజీహెచ్లో కొత్త మిషన్.. ఇన్ఫెక్షన్లకు ఇక చెక్!
కర్నూలు జీజీహెచ్లో కొత్త మిషన్.. ఇన్ఫెక్షన్లకు ఇక చెక్!
new-autoclave-machine-inaugurated-in-kurnool-ggh-ca


కర్నూలు , 22 మే (హి.స.) కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాత్ ల్యాబ్ (Cath Lab) విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోక్లేవ్ (Autoclave) మిషన్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల (HDS Funds) ద్వారా ఈ అత్యాధునిక మిషన్ను సమకూర్చడం జరిగింది.

సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ క్యాత్ ల్యాబ్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే వైద్య పరికరాలను, దుస్తులను అధిక పీడన ఆవిరి ద్వారా నూటికి నూరు శాతం క్రిమిరహితం చేస్తుందన్నారు.

ఆపరేషన్ల సమయంలో రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఈ మిషన్ కీలక పాత్ర పోషిస్తుంది, తద్వారా రోగుల ఆరోగ్య భద్రత మరింత మెరుగు పడుతుంది అన్నారు.

క్యాత్ ల్యాబ్ విభాగంలో రోగులకు మరింత మెరుగైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడానికి ఈ మిషన్ ఎంతగానోఉపయోగపడుతుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande