ఉమర్ ఖలీద్కు 3 రోజుల తాత్కాలిక బెయిల్
ఉమర్ ఖలీద్కు 3 రోజుల తాత్కాలిక బెయిల్
umar


న్యూఢిల్లీ:, 22 మే (హి.స.)

ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఖలీద్(Umar Khalid)కు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఖలీద్కు బెయిల్ జారీ చేసింది. ఖలీద్ తల్లికి వైద్య చికిత్స జరగాల్సి ఉంది, ఈ నేపథ్యంలో తల్లిని చూసేందుకు కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ మధూ జైన్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. విస్తృతమైన కోణంలో ఈ సమస్యను పరిశీలించి, తల్లికి సర్జరీ ఉన్న నేపథ్యంలో ఉమర్ ఖలీద్కు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఖలీద్ తన తల్లితో గడపనున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande