జూలై నుంచి అందుబాటులోకిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
జూలై నుంచి అందుబాటులోకిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
జూలై నుంచి అందుబాటులోకిభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం


, విశాఖపట్నం, 23 మే (హి.స.)

: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 8 నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ కొన్ని విమానయాన సంస్థలు ప్రకటిస్తున్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’ తన వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం (వీటీజెడ్) నుంచి కాకుండా 50 కి.మీ. దూరంలో కొత్తగా భోగాపురంలో నిర్మిస్తున్న ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ నుంచి సర్వీసులు నడుస్తాయని తమ ప్రయాణికులకు ఎడ్వైజరీ జారీచేసింది.

జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జులై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఏదైనా ఒక రోజు ప్రారంభోత్సోవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్రప్రభుత్వం ఇటీవలే విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన నాలుగు తేదీల్లో జులై 5న ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు కావచ్చని భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande