
అమరావతి, 23 మే (హి.స.)రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వేసవి పరిస్థితులు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ఏపీ విద్యుత్తు సంస్థలు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్ను ఎదుర్కొంటున్నాయని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యుత్తు శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్ర గ్రిడ్ 21వ తేదీ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 288.9 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగాన్ని నమోదు చేసిందని చెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు వినియోగం 285మిలియన్ యూనిట్లు నమోదు చేయగా, అర్ధరాత్రి12 గంటలకు 288.9మి. యూనిట్లకు చేరిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ