స్వచ్ఛాంద్రాకు ప్రజల భాగస్వామ్యం అవసరం / మంత్రి నారాయణ
స్వచ్ఛాంద్రాకు ప్రజల భాగస్వామ్యం అవసరం / మంత్రి నారాయణ
స్వచ్ఛాంద్రాకు ప్రజల భాగస్వామ్యం అవసరం / మంత్రి నారాయణ


విజయవాడ, 23 మే (హి.స.)స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ )వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా వందశాతం స్వచ్ఛాంద్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. ఈరోజు నుంచి ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత లక్ష్యం నినాదంతో ఏపీవ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇవాళ(శనివారం) విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు.ఏపీలో నాలుగు వారాలు ఈ కార్యక్రమం చేయాలని, ఈ రోజు మున్సిపల్ శాఖ నిర్ణయించిందని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తర్వాత రెండోవారం కాలువలన్నిటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు ప్రజల భాగస్వామ్యలు అవుతామని చెప్పుకొచ్చారు. మూడోవారం ఇల్లు, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వామ్యలు అవుతామని తెలిపారు. నాలుగోవారం పబ్లిక్ టాయిలెట్స్ దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్లుగా ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande