శరవేగంగా ఆంధ్రా కర్ణాటక తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్ట్ తుంగభద్ర క్రస్ట్ గేట్ పనులు
శరవేగంగా ఆంధ్రా కర్ణాటక తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్ట్ తుంగభద్ర క్రస్ట్ గేట్ పనులు
శరవేగంగా ఆంధ్రా కర్ణాటక తెలంగాణ ఉమ్మడి నీటి ప్రాజెక్ట్ తుంగభద్ర క్రస్ట్ గేట్ పనులు

అమరావతి, 23 మే (హి.స.)

బళ్లారి(బెంగళూరు):ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి. గేట్లను అధికారికంగా ప్రారంభించేందుకు బోర్డు ఇంజనీర్లు సీడబ్ల్యూసీ అధికారులతో పాటు మూడు రాష్ట్రప్రభుత్వాలను ఆహ్వానం పలకనున్నారు. 33 కొత్త క్రస్ట్గేట్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అందరి సమక్షంలో త్వరలో ప్రారంభిస్తామని బోర్డు అధికారులు, సెక్రటరీ ఓ.ఆర్.కే రెడ్డి, ఎస్సీ నారాయణ నాయక్, బోర్డు చైర్మన్ పాండ్య తెలిపారు.

తెలంగాణా, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అధికారులకు ఆహ్వనించామని, కేంద్ర జలవనరులు శాఖకు కూడా సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande