ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఏపీ సీఎం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఏపీ సీఎం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ఏపీ సీఎం


అమరావతి, 23 మే (హి.స.)

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే.. స్థానికంగా సెలవులు ప్రకటించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, మండలస్థాయి అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో తీవ్రంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజారోగ్యంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘2015లో బలమైన ఎల్నినో కారణంగా రాష్ట్రంలో 50.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 48 డిగ్రీలు వచ్చింది. మూడు రోజుల్లో 45 నుంచి 48 డిగ్రీలకు పెరిగాయి. వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 1,349 హీట్షెల్టర్లు, 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించే ఏర్పాట్లు చేశాం’ అని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande