సీఎం యాదాద్రి పర్యటనలో.. అధికారుల వైఫల్యం
సీఎం యాదాద్రి పర్యటనలో.. అధికారుల వైఫల్యం
Cm


యాదాద్రి భువనగిరి, 23 మే (హి.స.)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డియాదగిరిగుట్ట పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం, ప్రోటోకాల్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. సీఎం, మంత్రుల హెలికాప్టర్ (చాపర్) నిర్దేశిత వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై ల్యాండ్ అయినప్పటికీ, అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది.

ఈ ప్రోటోకాల్ లోపం, అధికారుల మధ్య సమన్వయ రాహిత్యం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి, తోటి మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు చాపర్లోనే వేచి ఉండాల్సి రావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వీఐపీ పర్యటనలో స్థానిక కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు సీరియస్ అయ్యాయి. అధికారుల సమన్వయ లోపాన్ని పక్కనబెడితే, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల నిర్మాణంతో పాటు మొత్తం రూ.99.55 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, స్వామివారిని దర్శించుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande