
హైదరాబాద్, 23 మే (హి.స.)
హైదరాబాద్ లో నేటి ఉదయం ఓ న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే దుండగులు కారుతో వచ్చి ఢీ కొట్టి అక్కడ నుండి పరార్ అయ్యారు. ఈ ఘటన మాసబ్యంక్ ప్రాంతంలో జరిగింది. ఉదయం న్యాయవాది కాజా మొయినుద్దీన్ ఇంటి నుండి బయటకు వచ్చి కారులో వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఆయన కారు డోర్ తీస్తున్న సమయంలో అప్పటికే ఆయన ఇంటి పక్కన దుండగులు కాపు కాస్తూ ఉన్నారు. ఆయన కారులో ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో వెనకనుండి ఒక్కసారిగా వేగంగా వచ్చి ఢీ కొట్టారు. దాడితో మొయినుద్దీన్ ఎగిరి కిందపడిపోయారు. ఆయనకు తీవ్రగాయాలు కాగా ఢీ కొట్టిన వెంటనే నిందితులు అక్కడ నుండి పరార్ అయ్యారు.
కాగా కారు దాడికి గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీ కొట్టి పరారైన అనంతరం కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. క తీవ్రగాయాలపాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేయగా తరవాత హత్య కేసుగా మార్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నంబర్ ట్రేస్ చేస్తున్నారు. భూ వివాదాల కారణంగానే నిందితులు మొయినుద్దీన్ ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మొయినుద్దీన్ వర్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం సైతం పోరాడుతున్నట్టు తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..