వైసిపి అధినేత జగన్ పై ఎంపీ.సీఎం రమేష్ ఆగ్రహం
వైసిపి అధినేత జగన్ పై అనగాపలీ ఎంపీ.సీఎం రమేష్ ఆగ్రహం
వైసిపి అధినేత జగన్ పై  ఎంపీ.సీఎం రమేష్ ఆగ్రహం


అమరావతి, 23 మే (హి.స.)

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై )బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ )తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు. ఓ కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎద్దేవా చేశారు. ఈరోజు (శనివారం) అమరావతి వేదికగా మీడియాతో ఎంపీ రమేశ్ మాట్లాడారు. ఓ మైన్ ఓనర్ను అంతమొందించి రాజారెడ్డి గనులు దక్కించుకుని ధనవంతుడయ్యారని విమర్శించారు. పులివెందులలో రాజారెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకొచ్చారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని... ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు గుప్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande