మెదక్ జిల్లా లో విషాదం.. గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి
మెదక్ జిల్లా లో విషాదం.. గంటల వ్యవధిలో వదిన, మరదళ్ల మృతి
క్రైమ్


మెదక్, 23 మే (హి.స.)

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని

చెందడంతో రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నెలలోపు బాలింతలైన వదిన-మరదళ్లు వరుసగా మృతి గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కర్షన్న నారాయణ కుమారుడు కర్షన్న రమేష్ భార్య అయిన స్వాతి(26) ప్రసవం అనంతరం తన తల్లిగారిల్లు అయిన చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఉంటుంది. స్వాతికి నెలలోపు పసికందు కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు మెదక్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

అనంతరం స్వాతి మృతదేహాన్ని అత్తగారిల్లు అయిన రెడ్డిపల్లికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో స్వాతికి వరసకు మరదలు అయిన కర్షన్న చిన్నముత్యం-లక్ష్మి దంపతుల కుమార్తె సౌందర్య(27) కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నెలలోపు బాలింత అయిన సౌందర్యను కుటుంబ సభ్యులు వెంటనే నార్సింగ్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. సౌందర్యకు నెలలోపు పసికందు కుమారుడు ఉన్నాడు. ఆమె అత్తగారిల్లు వీరారెడ్డిపల్లి కాగా, ప్రసవానంతరం ప్రస్తుతం రెడ్డిపల్లిలోనే ఉంటోంది. ఒకే కుటుంబ బంధానికి చెందిన వదిన-మరదళ్లు గంటల వ్యవధిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలోనూ విషాద వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande