కడపలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మెరుపు పర్యటన.. అధికారుల సమీక్ష!
కడపలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మెరుపు పర్యటన.. అధికారుల సమీక్ష!
ap-power-minister-gottipati-ravi-kumar-reviewed-electricity-p


కడప, 23 మే (హి.స.)

ఈరోజు కడపలో విద్యత్

శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు. ఈసందర్భంగా అక్కడి విద్యుత్ శాఖ

ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి , జిల్లాలో అమలౌవుతున్న

విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల పై ఆరాతీశారు. అదేవిధంగా పీఎం సూర్యఘర్

పథకం అమలు పై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి సూర్యఘర్ పనులను త్వరితగతిన

పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా కాంట్రాక్టర్లతో సమావేశం

ఏర్పాటు చేసి పనులను త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలి అని

అన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో

ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande