ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
సిద్దిపేట


సిద్దిపేట, 23 మే (హి.స.)

ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం

జరుగుతుండటంతో ఆగ్రహించిన రైతులు శనివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే గంటకు పైగా నిలిచిపోయాయి. రైతుల రాస్తారోకతో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. ఎండ వేడిమి, ఉక్క పోత తట్టుకోలేక ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ఇరవై రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జగదేవపూర్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకువచ్చారు. అయితే ఒక్కో కేంద్రం నుంచి గత ఇరవై రోజులుగా నాలుగు నుంచి ఐదు లారీల్లో మాత్రమే ధాన్యం తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లోనే సుమారు తొంభై శాతం ధాన్యం పేరుకు పోయిందన్నారు. మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె రానుంది. ఈ కార్తిలో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి పోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే తూకం వేసిన ధాన్యం కూడా రోజుల తరబడి కేంద్రాల్లోనే ఉండిపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపించారు.ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం గద్దె దిగాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లారీల సంఖ్య పెంచి ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande