
*ముంబై, 23 మే (హి.స.)భారత్లో నేడు కూడా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ధరలు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (మే 23) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.430ల మేర తగ్గి రూ.1,59,060కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి కూడా నిన్నటితో పోలిస్తే రూ.400ల మేర తగ్గి రూ.1,45,800కు చేరుకుంది. నగరంలో వెండి ధర మత్రం రూ.2.95 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు స్వల్ప స్థాయిలో తగ్గాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,690కు చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,47,300గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,59,060గా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,800గా ఉంది. రాజధాని న్యూఢిల్లీలో మేలిమి బంగారం ధర రూ.1,59,210 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,45,950 వద్ద కొనసాగుతోంది.
భారత్లో నేడు కూడా బంగారం ధరలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ధరలు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి (మే 23) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ.430ల మేర తగ్గి రూ.1,59,060కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి కూడా నిన్నటితో పోలిస్తే రూ.400ల మేర తగ్గి రూ.1,45,800కు చేరుకుంది. నగరంలో వెండి ధర మత్రం రూ.2.95 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ