కర్నూలులో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వయంగా రంగంలోకి కలెక్టర్ సిరి!
కర్నూలులో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వయంగా రంగంలోకి కలెక్టర్ సిరి!
క్లీనింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.


కర్నూలు, 23 మే (హి.స.)కర్నూలులో మహనగరంలో ఈ రోజు 'ఆపరేషన్ క్లీన్ స్వీప్'లో భాగంగా కేసీ కెనాల్ క్లీనింగ్ పనుల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.సిరి 4 రోజుల ప్రత్యేక డ్రైవ్తో రోడ్లు, కాలవల శుభ్రత క్లీనింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా కర్నూలు జిల్లాలో రోడ్లు,కాలవలు, టాయిలెట్ లను నాలుగు రోజుల డ్రైవ్ ద్వారా పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.

కర్నూలులోని వినాయక ఘాట్ వద్ద ఉన్న కేసి కెనాల్ క్లీనింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఒక్క కర్నూలు జిల్లాలో రోజుకు 220 టన్ను చెత్త ఉత్పత్తి అవుతుందని వీటిని డంప్ యార్డ్ లో మూడు భాగాలుగా క్లీన్ చేస్తున్నామని జిల్లాలో ఈ వేస్ట్, ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుందని వాటిని ఏజన్సీ ద్వారా క్లీన్ చేస్తున్నామని జిల్లా ప్రజలు కూడా జిల్లాను పూర్తిగా శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని ప్రజలు బయట చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాల్లో చెత్తను వేయాలని జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande