ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. బీఆర్ఎస్ నాయకుల నిరసన
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. బీఆర్ఎస్ నాయకుల నిరసన
Farmers


కరీంనగర్, 23 మే (హి.స.)

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోధాన్యం కొనుగోలు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గన్నేరు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రైతులతో కలిసి శనివారం కాసింపేట ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మరియు నాయకులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సరైన సమీక్ష నిర్వహించకపోవడం మూలంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుందని, రాబోయే కొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం అయ్యి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు సగం కూడా కాలేదని నోటి కందిన పంట వర్షార్పణమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో అధిక తుకంతో పాటు, గన్ని బ్యాగులు లేకపోవడం, లారీల కొరతతో సతమతమవుతున్నారని అన్నారు. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటల సాగు చేసిన వారి పరిస్థితి మరి హీనంగా ఉన్నదని వాటిని కొనే వారే కరువయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande