బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ సాగనివ్వం.. హరీశ్ రావు వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎటాక్
బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ సాగనివ్వం.. హరీశ్ రావు వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎటాక్
Minister


హైదరాబాద్, 23 మే (హి.స.)

మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటూ బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేయాలని బీఆర్ఎస్ యత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, విమర్శలు ప్రధాన అంశంగా మందుకు వెళ్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాము తిరిగిన అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. హరీశ్ రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వద్దా హరీశ్ రావు చెప్పాలన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అడ్డుకోవాలని చూస్తోందన్నారు. జంట నగరాలకు సంబంధించిన మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. శంషాబాద్ కు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని స్పష్టం చేశారు.

బాబు మూసీ ప్రక్షాళన చేయాలని మేము ప్రయత్నిస్తే బీఆర్ఎస్ దాని మిత్రపక్షం బీజేపీ అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని శ్రీధర్ ఆరోపించారు. ప్రతిపక్షాల ఆటంకాలతో ప్రజలకు నష్టం అన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు క్షమించరన్నారు. పరిశ్రమలు రాకుండా పెట్టుబడులు రాకుండా చేసేలా ప్రకటనలు చేస్తే తెలంగాణ యువతకు భారీ నష్టం చేసిన వారవుతారన్నారు. ప్రభుత్వంలో ఉండగా పదేళ్లు యువతకు నష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నష్టం చేస్తామంటే ప్రజలు సహించరన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande