
జడ్చర్ల, 23 మే (హి.స.)
జడ్చర్ల పట్టణంలో చాలా రోజుల
తర్వాత మళ్లీ ఓ స్వైన్ ఫ్లూ కేసు నిర్ధారణ అయింది. ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ కావడంతో హెచ్.వన్. పట్టణ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి ఎన్ వన్ స్వైన్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యులు అందించిన సమాచారం ప్రకారం, బాధితుడు గత కొన్ని రోజులుగా దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాడు. అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి వైరల్ న్యుమోనియాగా గుర్తించారు. అనంతరం వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరీక్షల కోసం నమూనాలను ల్యాబ్ కు పంపగా హెచ్ వన్ ఎన్ వన్ స్వైన్ ఫ్లూగా నిర్ధారణ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు