తిరుమల అప్డేట్: పెరిగిన భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ ఫుల్
తిరుమల అప్డేట్: పెరిగిన భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ ఫుల్
తిరుమల


తిరుమల, 23 మే (హి.స.)

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం లో వేసవి సెలవులు ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు ఎండలు దంచికొడుతున్నప్పటికి.. తిరుమల క్షేత్రంలో మంత్రం భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, వేలాది మంది భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో కిలోమీటర్ల మేర సుదీర్ఘ సమయం పాటు వేచి ఉన్నారు.

ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం దాదాపు 15 గంటల సమయం పడుతోంది. వేసవి తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది.

మరోవైపు, తిరుమల కొండపై గడిచిన 24 గంటల్లో కలియుగ వైకుంఠనాథుడిని రికార్డు స్థాయిలో 87,689 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారిపై భక్తితో తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తుల సంఖ్య 44,476 మందిగా నమోదైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా కళ్యాణకట్టలో టీటీడీ (TTD) సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారిపై భక్తులు కురిపించిన కానుకల వర్షం తో, నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4.29 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande