
మదనపల్లి, 23 మే (హి.స.)
: అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్యాంప్ ఈరోజు శనివారం ఘనంగా ముగిసింది.
హార్ట్ ఫుల్ నెస్ః సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హార్ట్ ఫుల్ నెస్ ట్రైనర్ మరియు యోగా టీచర్ డాక్టర్ గోపి ఈ కార్యక్రమానికి విచ్చేసి, పోలీస్ సిబ్బందికి యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానంపై ప్రత్యేక సాధన చేయించారు. నిరంతరం విధుల్లో ఉంటూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీస్ సిబ్బందికి మానసిక ప్రశాంతతను చేకూర్చడం, వారి శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం మరియు వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా నిర్వహించేలా చేయడమే ఈ యోగా మరియు ధ్యాన సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. నిత్య జీవితంలో ధ్యానం మరియు యోగాలను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో డాక్టర్ గోపీనాథ్ ఈ సందర్భంగా వివరించారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV