
విజయవాడ (కార్పొరేషన్),, 24 మే (హి.స.)
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్ యార్డు రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మున్సిపల్ వ్యవహారాల శాఖ నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని సాంబమూర్తి రోడ్డులో కూర్మయ్య బ్రిడ్జి వద్ద ‘ఆపరేషన్ క్లీన్స్వీప్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్చైర్మన్పట్టాభిరామ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ