కిక్కిరిసిపోతున్న తిరుమల.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటలు
కిక్కిరిసిపోతున్న తిరుమల.. శ్రీవారి దర్శనానికి ఏకంగా 24 గంటలు
తిరుమల


తిరుమల, 24 మే (హి.స.)వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి సైతం క్యూ కడుతున్నారు.

వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండపై భక్తజనం ఎగిసిపడుతోంది. ప్రతిరోజు లక్షల్లో భక్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు అన్ని ఫుల్ అయ్యాయి. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

మరోవైపు క్యూ లైన్లను బ్రేక్ చేస్తూ టీటీడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12గంటలకే దర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. భక్తుల తాకిడి ఎక్కువ ఉండటంతో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ఉన్నతాధికారలుు రాత్రింబవళ్లు సమీక్షిస్తూనే ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande