
ఆదోని, 24 మే (హి.స.)కోసిగి, సజ్జలగుడ్డం గ్రామాల సమీపంలో గల మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయ పరిసర పొలాలపై జింకల బెడద తీవ్రమైంది. బోరుబావుల కింద ఎంతో కష్టపడి సాగు చేసిన ఉల్లి, వేరుశనగ, కాయగూరల పంటలను జింకల మందలు పూర్తిగా నాశనం చేస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో జింకలు గుంపులుగా ఒకేసారి వచ్చి పొలాలపై పడి చేతికొచ్చే పంటలను ధ్వంసం చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు అప్పు చేసి సాగు చేసి, జింకలతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లోనే రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. కనురెప్ప మూసి తెరిచేలోగా పదుల సంఖ్యలో జింకలు వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి అని రైతులు ఆవేదన చెందుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV