మూడోసారి పెట్రో వడ్డన
మూడోసారి పెట్రో వడ్డన
Petrol Pump


న్యూఢిల్లీ,, 24 మే (హి.స.) దేశంలో ఇంధన ధరలు పది రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్కు 87 పైసలు పెరిగింది. దీంతో అక్కడ దాని ధర రూ.98.64 నుంచి రూ. 99.51కి పెరిగింది. డీజిల్ రేటు లీటర్కు 91 పైసలు పెరిగి రూ.91.58 నుంచి రూ.92.49కి చేరుకుంది. సీఎన్జీ ధరను రూ.1 పెంచారు.కాగా, మే 15న లీటర్పై రూ.3 పెరుగగా మే 19న 90 పైసలు పెరిగింది. మొత్తమ్మీద ఇప్పటివరకు లీటర్పై దాదాపు రూ.5 పెరిగినట్లయింది.

పది రోజుల్లో మూడుసార్లు ఇంధన ధరలను పెంచడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రజల సంపాదనను ప్రభుత్వం విడతల వారీగా లూటీ చేస్తోందని, దేశ విదేశాంగ విధానం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ‘పెట్రోల్-డీజిల్పై రోజుకు రూ.1,000 కోట్ల కేంద్ర పన్ను విధించినా బీజేపీ ఆకలి తీరలేదు. అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నపుడు ఆ ప్రయోజనాలను ప్రజలకు పంచకుండావారిని నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారు అని ఖర్గే పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపుపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande