ఫామ్ఆయిల్ పంటను సాగు చేయాలి... గండ్ర
భూపాలపల్లి, 10 అక్టోబర్ (హిం.స)రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఫామ్ ఆయిల్ పంట ద్వారా అధిక లాభాలను
ఫామ్ఆయిల్ పంటను సాగు చేయాలి... గండ్ర


భూపాలపల్లి, 10 అక్టోబర్ (హిం.స)రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఫామ్ ఆయిల్ పంట ద్వారా అధిక లాభాలను పొందవచ్చుఈ సంవత్సరం భూపాలపల్లి జిల్లా లో దాదాపు 45 వేల ఎకరాలలో ఈ పంటను వేయనున్నంసంవత్సరానికి ఎకరాకు 1 లక్ష రూపాయల నికర లాభం వస్తుంది అంతర్గత పంటలు కూడా వేసుకుని అదనపు లాభాలను కూడా పొందవచ్చు

ఈ రోజు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కాశింపల్లి గ్రామంలో ఫామ్ ఆయిల్ మొక్కలను నాటిన మన ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసన సభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు మరియు వారి తనయులు, తెరాస యువజన నాయకులు గండ్ర గౌతం రెడ్డి గారు సందర్భంగా గండ్ర మాట్లాడుతూ...

మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే నూతన పంటను పరిచయం చేస్తూ పామ్ ఆయిల్ పెట్టి రైతులకు అత్యంత ఆదాయం వనరులను కల్పించాలని ఉద్దేశ్యం తో పామాయిల్ పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇస్తూ,రైతులను ప్రోత్సహిస్తూ పెట్టిన పంట ఇది.

దీన్ని మన భూపాలపల్లి జిల్లాలో మొట్టమొదటిగా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని కాసిం పల్లి గ్రామంలో రోజు మొక్కలు నాటడం జరిగింది.మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ,మీ అందరికీ తెలుసు పెరుగుతున్నటువంటి నూనె యొక్క అవసరాలు. ఈరోజు నూనెకు సంబంధించినటువంటి ధాన్యాన్ని అంటే పల్లీలు,పొద్దు తిరుగుడు కావచ్చు మరి అనేక పంటలు ఈరోజు మన యొక్క అవసరాలు తీరుస్తున్నాయి.

కానీ భారతదేశం మొదటి 30 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం మన అవసరాలకు సరిపోయేటట్టి నూనె ఉత్పత్తి లేని సందర్భంలో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ సందర్భంలో విదేశీ మారక ద్రవ్యం అనేక దేశాలకు పోతున్నది.మన దేశంలో అత్యధికంగా వరి ధాన్యం ను పండిస్తున్నం.

ప్రభుత్వం ఈ యొక్క పామాయిల్ పంటను ప్రోత్సహించాలనే ఉదేశ్యం తోటి మరి మొదటి మూడు సంవత్సరాల పాటు ఎవరైతే రైతులు ఫామ్ ఆయిల్ పంట వేస్తారో వారికి ఆదాయ తక్కువ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదాయ వనరుల కింద పెట్టుబడి సహాయం, మరి మొక్కల పై సబ్సిడీ,డ్రిప్ వంటి పధకాలను అందిస్తుంది.

కాబట్టి ఉత్సాహవంతులైన రైతు సోదరులు ఈ సదవకాశం ఉపయోగించు కోవాలని కోరారు.

మరి ఈ పంటను మొదటి మూడు సంవ్సరాలపాటు కాపాడుకుంటే దాదాపు జీవిత కాలం వరకు అంటే దాదాపు 45 సంవత్సరాల పాటు నిరంతరం ఆదాయం వస్తుంది.

తరువాత ఇంటర్ పంటలు కూడా పెట్టుకోవచ్చు.దీని ద్వారా అధిక ఆదాయం వస్తుంది.దీని రైతు సోదరులు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించు కోవాలని కోరారు.

దీని వల్ల సంవత్సరానికి 1,00,000 /- రూపాయల నికర లాభం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ సెగ్గెం వెంకట రాణి సిద్ధూ,వైస్ చైర్మన్ హరిబాబు,PACS చైర్మన్ మేకల సంపత్,టౌన్ పార్టీ అధ్యక్షుడు జనార్ధన్, కౌన్సిలర్లు,జిల్లా ముఖ్య నాయకులు,కార్యకర్తలు,రైతులు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande