టిఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ లు
తెలంగాణ 13 అక్టోబర్ (హిం.స)టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు క
టిఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ లు


తెలంగాణ 13 అక్టోబర్ (హిం.స)టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేదీలు ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ వుంటాయని, 25న టీఆర్ఎస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలియజేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీ ఏర్పాటు అయిందని ఆయన తెలిపారు. అనేక సవాళ్లను ఎదుర్కొని ఇక్కడ ప్రజల కలలను సాకారం చేసిందని చెప్పుకొచ్చారు తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న నిర్వహిస్తామన్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande