Custom Heading

హుజురాబాద్ బరిలో 39 మంది అభ్యర్థులు
తెలంగాణ, 13 అక్టోబర్ (హిం.స)హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా, నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివర
హుజురాబాద్ బరిలో 39 మంది అభ్యర్థులు


తెలంగాణ, 13 అక్టోబర్ (హిం.స)హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుండగా, నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అర్ధాంగి ఈటల జమున తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లింగారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి రాజ్ కుమార్ కూడా తమ నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. మూడు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం హుజూరాబాద్ బరిలో 39 మంది అభ్యర్థులు మిగిలారు. ప్రధానంగా టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి పోటీలో ఉన్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande