అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు
వాషింగ్టన్: అక్టోబర్ 14(హిం.స) పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు
అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు


వాషింగ్టన్: అక్టోబర్ 14(హిం.స)

పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు! కొవిడ్ ఉద్ధృతి నెమ్మదించి, టీకా కార్యక్రమం ఊపందుకోవడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. దీంతో ఆహార బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య ఆరు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ, కొవిడ్ ముందునాళ్లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి తీవ్రత 55% ఎక్కువగానే ఉన్నట్టు ‘ఫీడింగ్ అమెరికా’ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యనిర్వాహకురాలు కేటీ ఫిట్జరాల్డ్ చెప్పారు.

నాగరాజ్ రావు, సంతోషలక్ష్మి, హిందుస్తాన్ సమాచార


 rajesh pande