తండ్రి రెండు నెలల చిన్నారినికడతేర్చాడు
గ్రామీణం: భార్య మీద ఉన్న అనుమానంతో ఓ కసాయి తండ్రి రెండు నెలల చిన్నారిని కడతేర్చాడు. ఈ అమానుష ఘటన అనం
తండ్రి రెండు నెలల చిన్నారినికడతేర్చాడు


గ్రామీణం: భార్య మీద ఉన్న అనుమానంతో ఓ కసాయి తండ్రి రెండు నెలల చిన్నారిని కడతేర్చాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది. చిన్నారి నోటికి ప్లాస్టర్ అతికించి గోనె సంచిలో పెట్టి చెరువులో పడేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లికార్జున అనే వ్యక్తి తన భార్య చిట్టెమ్మ, రెండు నెలల పాపతో కలిసి కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పాప ఏడుస్తుండటంతో మల్లికార్జున చిన్నారిని ఓదారుస్తూ ఆస్పత్రి బయటకు తీసుకొచ్చేశాడు. సాయంకాలమైనా తిరిగి రాకపోవడంతో అనుమానంతో భార్య చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హిందూస్తాన్ సమాచార్-/నాగరాజ్


 rajesh pande