మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యా
మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి


మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .

తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అక్టోబర్ 22( హిం స)

శుక్రవారం అయన మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఎనుగొండ నుండి సిద్దాయ పల్లి వరకు 76 లక్షల రూపాయల వ్యయంతో 1.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బి టి రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అంతేకాక నగర కాలనీలో ఒక్కొక్కటి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 సి సి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా పట్టణం నలువైపుల రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పన తోపాటు , ప్రధాన రహదారి విస్తరణ కార్యక్రమాలను చేపటైనట్లు వెల్లడించారు .గతంతో పోలిస్తే జిల్లా కేంద్రంలో అనేక సౌకర్యాలను కల్పించడం జరిగిందని, గతంలో 14 రోజులకు ఒకసారి తాగు నీరువస్తుండగా ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు తాగునీటి అందిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ నర్సింలు, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, వార్డ్ కౌన్సిలర్ వనజ, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ విష్ణు,ఏ ఈ సురేష్, మున్సిపల్ ఇంజనీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మహి పాల్ రెడ్డి హిందుస్థాన్ సమాచార్


 rajesh pande