గంజాయి అక్రమంగా రవాణా చేసే వారిపై క్రిమనల్ కేసులు
తెలంగాణ:అక్టోబర్:22:(హింస)రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు మరియు గౌరవ డిజిపి గ
గంజాయి అక్రమంగా రవాణా చేసే వారిపై క్రిమనల్ కేసులు


తెలంగాణ:అక్టోబర్:22:(హింస)రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు మరియు గౌరవ డిజిపి గార్ల ఉత్తర్వుల మేరకు దేశ భవిష్యత్తు ను నిర్ణయించే యువకుల పై గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీవ్ర ప్రభావం చూపుతు వారి భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రం లో మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారి పై, సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారి పై ఉక్కు పాదం మోపడం తో పాటు వాటికి యువత దూరంగా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలు, అవలంబించాల్సిన విధివిధానాల పై పలు సూచనలు ఇవ్వబడినందున సిపి గారు ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కొమురంభీం ఆసిఫాబాద్ పోలీస్ అధికారులు తో జూమ్ మీటింగ్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ..... రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి ,మంచిర్యాల్ మరియు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలను ను గంజాయి, రహిత జిల్లాల గా మార్చేందుకు పోలీస్ అధికారులు సంసిద్దులై ఉండాలని, రామగుండము పోలీస్ కమిషనరేట్, మరియు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో ఎక్కడైనా, ఎవరైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్న, ఉత్పత్తి, సాగు మరియు సరఫరా చేసే వారిపై నిఘా ఉంచి అందుకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో పాటు కఠినంగా వ్యవహరించాలని వారిపై పిడి ఆక్ట్ అమలు చేయాలనీ రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్ర శేఖర్ రెడ్డి ఐపిఎస్ గారు పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

Ø రేపటి తరానికి బావి భారత పౌరులుగా భావించే నేటి యువత గంజాయి, డ్రగ్స్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలకు పాల్పడి ఆర్దికంగా, మానసికంగా, శారీరకంగా మరియు ఫిట్నెస్ ను కోల్పోవడం, అనారోగ్యం బారినపడటమే కాకుండా తాము ఏమి చేస్తున్నామో అనే విచక్షణ ను కోల్పోయి నేరాలకు పాల్పడటం జరుగుతుందని, యువత భవిష్యత్తు పై అంతగా ప్రభావం చూపుతున్న గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, సాగు, సరఫరా పై ఉక్కుపాదం తో అణిచివేయలని అధికారులకు సూచించారు.

Ø రామగుండం పోలీస్ కమిషనరేట్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడైనా గంజాయి సరఫరా,ఉత్పత్తి మరియు సాగు చేసే ఎవరికైనా పోలీస్ అధికారులు లేదా సిబ్బంది సహకరించిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Ø హోం గార్డు అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు దీని పై సీరియస్ గా ఉండాలని, పోలీస్ అధికారులు , సిబ్బంది తమకు గ్రామాలలో సరైన నెట్వర్క్ ఏర్పరచుకొని యువత, చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేసేవారిపై ,వారు చేస్తున్న పనులపై పై నిఘా ఉంచాలని, తమ పోలీస్ స్టేషన్ పరిదిలోని గ్రామాలను సందర్శించి యువత అలవాట్లను, జీవన విధానాలను తెలుసుకోవాలని అన్నారు.

Ø గ్రామాలలో, పట్టణాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో గాని గంజాయి మొక్కలు పెంచిన, దొరికిన సంబంధికుల పై చట్టపరమైన కేసులు నమోదు చేసి వారిపై PD యాక్ట్ అమలు చేయాలని అధికారులకు సూచించారు.

Ø మారుమూల ప్రాంతాలలో డ్రోన్ కెమరాలను ఉపయోగించి గంజాయి పండిస్తున్న ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు.

Ø ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములలో గంజాయి మొక్కలు దొరికిన ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని అలాగే పట్టా భూములలో గంజాయి దొరికిన ఆ భూమి యజమానికి రైతు బంధు రాకుండా కలెక్టర్ ద్వారా రద్ద చేయడం జరుగుతుందని కావున ప్రజలు ఎవరు కూడా అత్యాశకు పోయి ఇబ్బందులు పడవద్దు అని సిపిగారు విజ్ఞప్తి చేశారు. గంజాయి ని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Ø గంజాయి,గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ ను సమూలంగా అరికట్టడం లో ప్రజల పై కూడా బాధ్యత ఉందని, రామగుండం పోలీస్ కమిషనరేట్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో ఎక్కడైనా వాటి సరఫరా,ఉత్పత్తులు జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే ప్రజలు బాధ్యతగా భావించి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని,వారి వివరాలు గోప్యంగా ఉంచబడును అనిఅలాగే వారికీ క్యాష్ రివార్డ్ ఇవ్వబడును అని సిపి గారు తెలియజేసారు

Ø గంజాయి ని అరికట్టడం లో కృషి చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బంది కి ప్రత్యేక రివార్డ్స్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు.

ఈ జూమ్ మీటింగ్ లో డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్,కొమురంభీం ఆసిఫాబాద్ అడ్మిన్ ఎస్పీ వై. వి. ఎస్.సుధీంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నారాయణ, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ కమలాకర్,రామగుండం కమిషనరేట్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని డీసీపీ, ఏసీపీ, డీఎస్పీ లు మరియు అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, సర్కిల్ అధికారులు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.హిందూ సమాచార/పెద్దపల్లి జిల్లా/బెందె.నాగభూషణం రిపోర్టర్


 rajesh pande